Israeli Strike: బీరుట్ లోని నివాస ప్రాంతాల్లో ఇజ్రాయెల్ డ్రోన్ దాడి.. నలుగురు మృతి

by Shamantha N |
Israeli Strike: బీరుట్ లోని నివాస ప్రాంతాల్లో ఇజ్రాయెల్ డ్రోన్ దాడి.. నలుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. లెబనాన్ రాజధాని బీరూట్ లోని నివాస ప్రాంతాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ డ్రోన్ దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. శివారు ప్రాంతాలే కాకుండా, ఆదివారం సాయంత్రం నుంచి బీరుట్‌ సిటీలో కూడా దాడులు జరుగుతున్నాయి. బీరూట్‌లోని కోలా ప్రాంతంలోని భవనంపై జరిగిన దాడిలో పలువురు చనిపోయారు. హిజ్ బొల్లా నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నగర పరిధిలో ఇటువంటి దాడి జరగడం ఇదే మొదటిది.

ఐడీఎఫ్ దాడులు

ఆదివారం రాత్రి బెకా లోయలోని డజన్ల కొద్దీ హిజ్ బొల్లా స్థానాలపై దాడి చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) తెలిపింది. 2 గంటల్లోనే యుద్ధ విమానాలు లెబనాన్‌లోని బెకా వ్యాలీలో డజన్ల కొద్దీ హిజ్ బొల్లా స్థానాలను లక్ష్యంగా చేసుకున్నాయని ఐడీఎఫ్ వెల్లడించింది. దాడి చేసిన లక్ష్యాలలో రాకెట్ లాంచర్లు, హిజ్బుల్లా ఆయుధాలు నిల్వ చేసిన భవనాలు ఉన్నాయి. ఇజ్రాయెల్‌పై తీవ్రవాద కార్యకలాపాలకు హిజ్బుల్లా ఉపయోగిస్తున్న దక్షిణ లెబనాన్‌లోని ఇతర లక్ష్యాలపై కూడా ఐడీఎఫ్ దాడి చేసింది. కొంతకాలం క్రితం లెబనాన్ నుండి డిఫెన్స్ ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించిన అనుమానాస్పద వైమానిక దాడులను ఎయిర్ ఫైటర్ జెట్‌లు విజయవంతంగా అడ్డుకున్నాయని ఐడీఎఫ్ తెలిపింది. ఉత్తర సరిహద్దు పట్టణం రామోట్ నఫ్తాలీ ప్రాంతంలో క్షిపణి ఇంటర్‌సెప్టర్ల నుండి పడిపోతున్న శకలాలు రాకెట్ సైరన్‌లను యాక్టివేట్ చేశాయని ఐడీఎఫ్ తెలిపింది.

ఇప్పటికి 105 మంది మృతి

ఆదివారం జరిగిన వైమానిక దాడుల్లో లెబనాన్ వ్యాప్తంగా కనీసం 105 మంది మరణించారని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దక్షిణ నగరమైన సిడాన్ సమీపంలో జరిగిన రెండు దాడుల్లో కనీసం 32 మంది మరణించారని వెల్లడించింది. బాల్‌బెక్ హెర్మెల్ ఉత్తర ప్రావిన్స్‌లో జరిగిన దాడుల్లో 21 మంది మరణించగా..47 మంది గాయపడ్డారు. గత రెండు వారాల్లో లెబనాన్‌లో ఇజ్రాయెల్ చర్యలు తీవ్రమయ్యాయి. ఇకపై బీరుట్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో వెయ్యి మందికిపైగా చనిపోయారు.

Advertisement

Next Story

Most Viewed