19 ఏళ్లకే ఆల్జీమర్స్ వ్యాధి.. చైనా టీనేజర్‌లో నిర్ధారించిన వైద్యులు

by Mahesh |
19 ఏళ్లకే ఆల్జీమర్స్ వ్యాధి.. చైనా టీనేజర్‌లో నిర్ధారించిన వైద్యులు
X

బీజింగ్: చైనా టీనేజ్ వ్యక్తిలో ఆల్జీమర్స్ కలకలం రేపింది. డ్రాగన్ దేశంలో 19 ఏళ్ల వ్యక్తిలో ఈ వ్యాధిని నిర్ధారించినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. బీజింగ్ లోని క్యాపిటల్ మెడికల్ యూనివర్సిటీ జువాన్ వు హాస్పిటల్ రీసెర్చర్స్ ప్రకారం ఈ యువకుడి జ్ఞాపకశక్తి రెండేళ్లలో వేగంగా క్షీణించినట్లు తెలిపారు. ఇటీవల సంఘటనలు, వస్తువలు స్థానాలను గుర్తించలేని స్థితికి చేరుకున్నట్లు చెప్పారు.

అయితే ఇది వ్యాధి ప్రారంభ సంకేతమని అన్నారు. కాగా, దీని కారణంగానే స్కూల్ జీవితాన్ని త్వరగా వదిలేసినట్లు ఓ నివేదిక పేర్కొంది. అయితే ఈ పరిశోధన భవిష్యతులో ఎదురయ్యే సవాళ్ళను పరిష్కరించడంలో సహాయపడుతుందని తెలిపింది. జన్యు సంబంధిత లక్షణాలు లేకుండా చూసుకుంటే అతిచిన్న వయసులో గుర్తించిన అల్జీమర్స్ కేసు ఇదే కావడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed