మంత్రుల ఇళ్లకు నిప్పు.. 13 మంది పోలీసులు సజీవ దహనం

by Gantepaka Srikanth |
మంత్రుల ఇళ్లకు నిప్పు.. 13 మంది పోలీసులు సజీవ దహనం
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస చెలరేగింది. హింసాత్మక ఘటనలతో దేశం మొత్తం అట్టుడికిపోతోంది. ఆ దేశ అధికార పార్టీ మద్దతుదారులు, ఆందోళనకారులకు మధ్య ఆదివారం మరోసారి భారీ ఘర్షణ జరిగింది. ఈ దాడుల్లో దాదాపు 50 మందికి పైగా మృతిచెందారు. మరోవైపు ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. తక్షణమే ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. దేశ రాజధాని అయిన ఢాకాలోని ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఢాకాలో పరిస్థితి పూర్తిగా చేదాటిపోవడంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు. అంతేకాదు.. సిరాజ్‌గంజ్‌లో పోలీస్ స్టేషన్‌పై నిరసనకారులు దాడి చేశారు. ఏకంగా పోలీస్ స్టేషన్‌కే నిప్పు పెట్టారు. ఈ దాడిలో 13 మంది పోలీసులు సజీవదహనం అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed