ఘనంగా ప్రపంచ పశువైద్య దినోత్సవం

by Shyam |   ( Updated:2020-04-25 08:18:28.0  )
ఘనంగా ప్రపంచ పశువైద్య దినోత్సవం
X

దిశ, హైదరాబాద్: రాష్ట్రంలో జీవాలకు వైద్యసేవలు అందించడంలో, పశుగ్రాసం కొరత నివారణలో పశు సంవర్ధక శాఖ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పశు సంవర్థక శాఖ ఉద్యోగులు, పశు వైద్యుల ఆధ్వర్యంలో విద్యానగర్ రెడ్‌క్రాస్ భవనంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి‌తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని మాట్లాడుతూ లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంక్‌లలో రక్త నిల్వలు తగ్గిపోయాయని అన్నారు. ఇప్పుడు చేసే రక్తదానం తలాసేమియా, డయాలసిస్ రోగులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రక్తదానం చేసిన ఉద్యోగులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారుల సంఘం అధ్యక్షులు బాబు బెర్రి, పశువైద్య సంఘం అధ్యక్షులు దేవేందర్, విజయ్ కుమార్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

Tags: Blood Donation Camp, Red Cross, World Veterinary Day, Minister Talasani, muta Gopal, Thalassemia, Dialysis, Corona

Advertisement

Next Story