డబ్ల్యూఎల్‌పీ విస్తరణలో రెండో హబ్‌గా హైదరాబాద్

by Harish |
డబ్ల్యూఎల్‌పీ విస్తరణలో రెండో హబ్‌గా హైదరాబాద్
X

దిశ, వెబ్‌డెస్క్: అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య వాణిజ్యపరమైన అవకాశాలను పెంచేందుకు ఏర్పాటైన వరల్డ్ లాజిస్టిక్ పాస్‌పోర్ట్(డబ్ల్యూఎల్‌పీ) దేశీయంగా విస్తరణ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తన రెండో కార్యకలాపాల హబ్‌గా హైదరాబాద్‌ను ఎంపిక చేసింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించే జీఎంఆర్ గ్రూప్ అనుబంధ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దేశీయంగా ఎగుమతుల్లో హైదరాబాద్ కీలకంగా ఉందని భావిస్తున్నట్టు డబ్ల్యూఎల్‌పీ సీఈఓ మైక్ భాస్కరన్ అభిప్రాయపడ్డారు.

కాగా, డబ్ల్యూఎల్‌పీ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటిసారిగా దేశీయ మార్కెట్లో ప్రవేశించింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, నావా షెవా ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్, ఎమిరేట్స్ స్కై కార్గోతో భాగస్వామ్యం కలిగి ఉంది. డబ్ల్యూఎల్‌పీ ప్రస్తుతం దక్షిణాఫ్రికా, బ్రెజిల్ సహా పదికి పైగా దేశాలు, సోనీ, ఎల్‌జీ, జాన్సన్ అండ్ జాన్సన్, ఫైజర్ వంటి దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యం కొనసాగిస్తున్నట్టు మైక్ భాస్కరన్ వెల్లడించారు

Advertisement

Next Story

Most Viewed