- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది అసలు.. పరిష్కారమే కాదు : డబ్ల్యూహెచ్‌వో
నీవా: హెర్డ్ ఇమ్యూనిటీపై ఆశలు వదులుకోవాలని, అది అసలు పరిష్కారమే కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. కరోనాను నిలువరించే హెర్డ్ ఇమ్యూనిటీ దశకు ప్రపంచం సుదూరంలో ఉన్నదని పేర్కొంది. కరోనా సోకకుండా సరిపడా జనాభా యాంటీబాడీలను అభివృద్ధి చేసుకుని వైరస్‌కు చెక్ పెట్టడాన్నే హెర్డ్ ఇమ్యూనిటీగా పరిగణిస్తున్నారు. టీకా వేసుకుని 70 శాతం జనాభా యాంటీబాడీలను అభివృద్ధి చేసుకుంటే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమని నిపుణులు చెబుతున్నారు.
హెర్డ్ ఇమ్యూనిటీ వాదనలపై డబ్ల్యూహెచ్‌వో అసలు ఆశలే పెట్టుకోవద్దని తాజాగా కుండబద్దలు కొట్టింది. హెర్డ్ ఇమ్యూనిటీకా కావల్సినంత మందిలో ఇమ్యూనిటీ లేదని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 నుంచి 20 శాతం మందిలోనే యాంటీ బాడీలున్నట్టు చాలా అధ్యయనాలు వెల్లడించాయని పేర్కొంది. కాబట్టి, ‘హెర్డ్ ఇమ్యూనిటీ అసలు పరిష్కారమే కాదు. మనం హెర్డ్ ఇమ్యూనిటీ అనే పరిష్కారం కోసమూ చూడొద్దు’ అని డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ చీఫ్ డాక్టర్ మైఖేల్ ర్యాన్ తెలిపారు.