- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేటి నుంచి వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్
దిశ, వెబ్‌డెస్క్: అన్ని రకాల జబ్బుల నుంచి అన్ని వయస్సుల వారిని రక్షించడానికి వ్యాక్సిన్ల వాడకాన్ని పెంచే లక్ష్యంతో ప్రతి ఏడాది ఏప్రిల్ చివరి వారంలో వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ జరుపుకుంటాం. ఇప్పటి వరకు ప్రపంచంలో కనిపెట్టిన ఆరోగ్యపర పరిశోధనల్లో ఇమ్యునైజేషన్‌కి అత్యంత ప్రాధాన్యం ఉంది. వ్యాధినిరోధకత పెంచే వ్యాక్సిన్ల వల్ల ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాణాలు నిలబడుతున్నాయి. అయినప్పటికీ దాదాపు 20 మిలియన్ల మంది పిల్లలకు వ్యాక్సిన్లు సరిగా అవసరానికి అందడం లేదు.
ఈ నేపథ్యంలో 2020 సంవత్సరానికి గాను #VaccinesWork for All ఇతివృత్తంతో వ్యాక్సిన్లు ఎలా తయారవుతాయి, ఎవరు తయారు చేసి, గమ్యస్థానం వరకు ఎలా చేరతాయనే అంశాల మీద అవగాహన కల్పించనున్నారు.
మొదటిసారిగా 2012 మే మీటింగ్‌లో ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఒక్కో దేశంలో ఒక్కో వారంలో దీన్ని జరుపుకునేవారు. 2012 తర్వాతి నుంచి ఏప్రిల్ చివరి వారంలో అన్ని దేశాలు ఒకేలా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న సమయంలో ఇమ్యునైజేషన్ గురించి అందరూ అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:Corona, World Immunization day, Immunity, Vaccines