అట్టహాసంగా ముగిసిన ప్రపంచ వారసత్వ వారోత్సవాలు..

by Shyam |
sandeep
X

దిశ, మక్తల్: నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ముడుమాల్ వద్ద కొలువైన నిలువు రాళ్ల కొలువై ఉన్నాయి. ప్రపంచ వారసత్వ వారోత్సవాల సందర్భంగా నిలువురాళ్ల వద్ద జైమఖ్తల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు అట్టహాసంగా ముగిశాయి. వరల్డ్ హెరిటేజ్ వీక్ సందర్భంగా ఈనెల 19 నుంచి 25 వరకు పురావస్తు శాఖ, జైమఖ్తల్ ట్రస్ట్ సంయుక్తంగా ప్రతిరోజూ నిలువురాళ్ల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు జైమఖ్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు సందీప్ కుమార్ మఖ్తలా తెలిపారు. ఇందులోభాగంగా సాంస్కృతిక కార్యక్రమాలలో అవగాహన సదస్సులు ఏర్పాటుచేశామన్నారు.

వారోత్సవాలలో భాగంగా.. మఖ్తల్ నియోజవర్గ పరిధిలోని కళాకారులు చెక్క భజన, నృత్యాలు, ప్రత్యేక గీతాలు, కోలాటం వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. నిలువు రాళ్ల వద్ద చిన్నారులు బతుకమ్మ ఆడారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో చేపట్టిన నృత్య శిక్షణలో భాగంగా నిలువురాళ్ల వద్ద నృత్య ప్రదర్శన చేశారు. ట్రెండింగ్‌లో ఉన్న జానపద గేయాలకు డ్యాన్స్‌లు వేసి అలరించారు. గుడెబల్లూర్‌కు చెందిన బస్వరాజ్ పది వేళ్లతో నాలుగు భాషల్లో వివిధ డైరైక్షన్లలో రాయడానికి ప్రయత్ని్ంచాడు.

ముగింపు కార్యక్రమానికి ట్రస్ట్ అధ్యక్షుడు సందీప్ కుమార్ మఖ్తలా కుటుంబ సమేతంగా హాజరయ్యారు. నిలువురాళ్లకు యునెస్కో గుర్తింపు తీసుకు రావడమే తన లక్ష్యమని ఈ కార్యక్రమంలో సందీప్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story