ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరికలు…

by vinod kumar |
ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరికలు…
X

దిశ వెబ్ డెస్క్: దేశంలో అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల అన్‌లాక్ 4.0 మార్గ దర్శకాలను మోడీ సర్కార్ ప్రకటించింది. మెట్రో రైలు సేవలతో పాటు సామాజిక, విద్య, క్రీడలు, ఆధ్యాత్మిక సభలు నిర్వహించుకునేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. ఇక ఇప్పటికే చాలా దేశాలు అన్ లాక్ బాటలో ప్రయాణిస్తున్న సంగతి తెలసిందే. కాగా అన్ లాక్ ప్రక్రియపై ప్రంపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అన్ లాక్ కొనసాగుతున్న వేళ డబ్య్లుహెచ్ ఓ చీఫ్ టెడ్రోస్ అథనోవ్ తీవ్ర హెచ్చరికలు చేశారు. కరోనా ఇంకా పూర్తిగా తగ్గ లేదని ఆయన అన్నారు. అందుకే అన్ లాక్ ప్రక్రియ చేపట్టే ముందు ఆయా దేశాలు బాగా ఆలోచించాలని అన్నారు. తొందరి పడి తీసుకునే నిర్ణయాలతో సమస్యలు వస్తాయని అన్నారు. అన్ లాక్ పై దేశాలు ఎంత సీరియస్ గా ఆలోచిస్తున్నాయో…అంతకన్నా సీరీయస్ గా కరోనా కట్టడి కోసం పని చేయాలని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed