- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఏప్రిల్ ఫూల్ యాడ్.. యువతికి ఉచితంగా బిఎండబ్ల్యూ కారు
దిశ,వెబ్‌డెస్క్:మరికొద్దిరోజుల్లో ఏప్రిల్ 1 రాబోతుంది. మీరు ఆ రోజున ఫూల్ అవుతామేమోనని అనుకుంటారేమో. అలా అనుకోకండి. ఎందుకంటే ఏప్రిల్1న ఫ్రీ గా వచ్చే బిఎండబ్ల్యూ కార్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆగండాగండి.. బిఎండబ్ల్యూ కార్లా? ఫ్రీగా ఇస్తున్నారా? అని తొందరపడకండి.
ఏప్రిల్ 1న మనకు రకరకాల యాడ్స్ మనల్ని ఊరిస్తుంటాయి. అవి ఫేక్ యాడ్సేమోనని మీరు వాటిని లైట్ తీసుకుంటారేమో. అలా చేయొద్దు. ఎందుకంటే వాటిలో మీ డ్రీమ్ ఫుల్ ఫిల్ చేసే యాడ్స్ కూడా ఉంటాయి. ఏం నమ్మడం లేదా? అయితే మనం ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
2015, ఏప్రిల్ 1న న్యూజిలాండ్ హెరాల్డ్ అనే దినపత్రికలో కార్ డీలర్ షిప్ సంస్థ ‘ఏప్రిల్ ఫూల్స్ డే స్పెషల్’ పేరుతో యాడ్ ఇచ్చింది. ఏప్రిల్ 1న ఉదయం మా షోరూమ్ ఓపెన్ చేసిన తరువాత వచ్చే ఫస్ట్ కస్టమర్‌కి బిఎండబ్ల్యూ కారు ఉచితంగా ఇస్తామని ప్రమోట్ చేసింది. అయితే ఆ యాడ్ చూసిన ప్రతి ఒక్కరూ ఇదేదో తేడాగా ఉందే. మనల్ని ఫూల్ చేయడానికే షోరూం ప్రతినిధులు ఇలా యాడ్ ఇచ్చారని వెనక్కి తగ్గారు. కానీ 15 ఏళ్ల టియానా మార్ష్ మాత్రం ఆ యాడ్ ఫేక్ అని కొట్టిపారేయలేదు. నిజమని నమ్మంది. వెంటనే ఆక్లాండ్ లో ఉన్న బిఎండబ్ల్యూ షోరూమ్‌కు వెళ్లింది. అంతే అనుకున్నట్లుగానే సేల్స్ మేనేజర్ గావిన్ పెన్‌ఫోల్డ్ టియానా మార్ష్ కు బిఎండబ్ల్యూ కారు కీస్ చేతికిచ్చాడు. “NOF00L” అని రాసి ఉన్న నెంబర్ ప్లేట్ కూడా ఉంది. నాడు న్యూజిల్యాండ్ లో బిఎండబ్ల్యూ కారు విలువ రూ.36లక్షలకు పైమాటే.
ఏప్రిల్ ఫూల్ ఎలా వచ్చిందంటే?
1582లో అప్పటి ఫ్రాన్స్ రాజు 9వ చార్లెస్ సంప్రదాయంగా వస్తున్న క్యాలెండర్ ను మార్చేశాడు. గ్రిగేయియర్ క్యాలెండర్ ను ఆమోదించాడు. ఈ క్యాలెండర్ కు అనుగుణంగా జనవరి 1న న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని హుకుం జారీ చేశాడు. చార్లెస్ రాజు ఆదేశిస్తే ప్రజలు పాటించారు. అయితే కొంతమందికి రాజుగారి ఆదేశం చేరలేదు. ముఖ్యంగా రాజధాని దూర ప్రాంతాలకు ఇన్ఫర్మేషన్ అందలేదు. ఈలోగా మళ్లీ కొత్త ఏడాది వచ్చేసింది. రాజాజ్ఞ గురించి తెలిసిన కొందరు యువర్స్ ఫెయిత్ ఫుల్లీ అంటూ జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు చేసుకున్నారు. రాజు గారి ఆజ్ఞ తెలియని వాళ్లు ఏప్రిల్ 1 వరకు ఆగి న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.
జనవరి 1న న్యూఇయర్ వేడుకలు చేసుకున్న వాళ్లు ఏప్రిల్ ఫస్ట్ ను సెలబ్రేషన్ చేసుకున్న వాళ్లను ఫూల్స్ అంటూ గేలిచేశారు. అంతటితో ఆగలేదు. పేపర్లతో చేపల బొమ్మల్ని తయారు చేసి వాళ్ల వెనక భాగాన అంటించి ఆటపట్టించేవారు. చాలా తేలికగా గాలానికి దొరికే చేపలకింద జమకట్టేవారు. ఏప్రిల్ ఫిష్ అంటూ జోకులేసేవారు. ఇదే కాలక్రమంలో ఏప్రిల్స్ ఫూల్స్ డేగా మారిపోయింది.