- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లో నగదు బదిలీ ఎంతో కీలకం : ప్రపంచ బ్యాంకు!
దిశ, వెబ్‌డెస్క్ :
కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత్‌కు వరల్డ్ బ్యాంక్ ఆర్థిక సాయాన్ని అందించనుంది. తాజాగా ప్రపంచ బ్యాంకు దేశంలోని పట్టణ పేదల కోసం, వలస కార్మికుల కోసం సామాజిక భద్రత కింద 1 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 7,530 కోట్లు)ను ఇవ్వనుంది. ఇది ఆరోగ్యం, రక్షణకు సంబంధించి అతిపెద్ద ప్రాజెక్టుగా అభివర్ణించింది.ఈ సాయంతో ఇండియా అతిపెద్ద లబ్దిదారుగా నిలిచింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటం, ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు గురవుతున్న సమయంలో ఈ ప్రకటన వెలువడం శుభపరిణామం. దేశంలోని 400కు పైగా సామాజిక భద్రతా పథకాల అమలుకు ఈ 1 బిలియన్ డాలర్లు ఉపయోగపడతాయని ప్రపంచ బ్యాంకు భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలతో పాటు పట్టణ పేదల సామాజిక భద్రతను సమతుల్యం చేసేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకమని వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ జునైద్ అహ్మద్ అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇదే సందర్భంలో ప్రధాని మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ ఆర్థిక ప్యాకేజీ సైతం ఎంతో విలువైనదని ప్రశంసించారు.
కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాత భారత్‌లో ప్రజల జీవితం, జీవనోపాధిలో పెద్ద మార్పు ఉంటుందని అనుకోవట్లేదని, నగదు బదిలీ విధానం ఎంతో కీలకమైనదని, దీని వలన జీవన ప్రమాణాలు వేగంగా, సులభంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని ప్రపంచ బ్యాంకు సోషల్ ప్రొటెక్షన్ డైరెక్టర్ మైఖేల్ పేర్కొన్నారు. ఏప్రిల్ నెల ప్రారంభంలో కరోనా ప్రభావాన్ని అధిగమించేందుకు ప్రపంచ బ్యాంకు 1 బిలియన్ డాలర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల బ్రిక్స్ దేశాల డెవలప్‌మెంట్ బ్యాంక్ కూడా 1 బిలియన్ డాలర్లు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు వెల్లడించగా, తాజాగా మరోసారి 1 బిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. సోషల్ ప్రొటెక్షన్ పేరుతో పలు దేశాలకు ప్రపంచ బ్యాంకు నిధులను సమకూరుస్తోంది.