మూర్చ వచ్చి.. మునిగిపోయాడు

by Shyam |   ( Updated:2020-06-13 09:16:24.0  )
మూర్చ వచ్చి.. మునిగిపోయాడు
X

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందాపూర్ వద్ద రంగనాయక సాగర్ ఎడమ కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. రంగనాయక సాగర్‌ సబ్ స్టేషన్ వద్ద పనిచేస్తున్న వలస కార్మికుడు పాపాత్ముల లాలయ్య (37) పనులు ముగించుకొని శనివారం సాయంత్రం స్నానం చేయడానికి కాలువలోకి దిగాడు. స్నానం చేస్తున్న క్రమంలో లాలయ్యకు మూర్చ రావడంతో నీళ్లలో మునిగి చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story