వర్క్ ఫ్రమ్ వెడ్డింగ్.. పెళ్లిమండపంలో ల్యాప్‌టాప్‌తో వరుడు

by Shyam |
వర్క్ ఫ్రమ్ వెడ్డింగ్.. పెళ్లిమండపంలో ల్యాప్‌టాప్‌తో వరుడు
X

దిశ, ఫీచర్స్ : పాండమిక్ సిచ్యువేషన్ ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందంటే ఏమో అనుకున్నాం కానీ.. కొన్ని సంఘటనలు చూశాక నిజమే అనిపిస్తోంది. ఇక విషయానికొస్తే.. కొవిడ్ మూలంగా చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వర్క్ బిజీ వల్ల గతంలో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయలేకపోయిన వారికి మేలు చేసినా.. వర్క్-లైఫ్‌ను బ్యాలన్స్ చేసుకోవడమంటే మాటలు కాదు. ఎందుకంటే ఉద్యోగుల పర్సనల్ ప్రాబ్లమ్స్‌తో కంపెనీకి పనిలేదు. పెళ్లైనా, చావులతో సంబంధం లేదు. విధించిన గడువులోగా టాస్క్ పూర్తిచేయకుంటే ఏం జరుగుతుందో తెలియంది కాదు. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో మూడుముళ్లు వేయాల్సిన ఓ వరుడు.. పెళ్లి మండపంలో కూర్చొని వర్క్ చేసుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది.

పాపులర్ వెడ్డింగ్ రిలేటెడ్ ఇన్‌స్టా్గ్రామ్ పేజీలో ఈ వీడియో క్లిప్ షేర్ చేశారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి పెళ్లి మండపంలో కూర్చున్న వరుడు, ఒళ్లో ల్యాప్‌టాప్ పెట్టుకుని ఆఫీస్ పనిలో నిమగ్నమైపోయాడు. ఇక బంధువులు, పండితుడు తన కోసమే వెయిట్ చేస్తుండగా.. వెయిటింగ్ రూమ్‌లో పెళ్లి కూతురు రియాక్షన్ చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. మహారాష్ట్రకు చెందిన వధువు.. పెళ్లి రోజున చేసుకోబోయేవాడి కష్టాలు చూసి నవ్వుకుంటుండగా కెమెరామెన్ ఈ ఫన్నీ ఇన్సిడెంట్ క్యాప్చర్ చేశాడు. ఈ అరుదైన సంఘటనపై నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తుండగా.. ‘వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్క్ ఫ్రమ్ వెడ్డింగ్’ అనే క్యాప్షన్‌తో ఈ రీల్ వీడియో వైరల్‌గా మారింది.

https://www.instagram.com/reel/CRqMZtLHdrQ/?utm_source=ig_embed&ig_rid=964e19e6-87e1-4bc7-9ae3-1f3136bb1609

అయితే ఈ సంఘటనపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొందరు కార్పొరేట్ కార్యాలయాల వర్క్ కల్చర్‌ను విమర్శిస్తుంటే.. మరికొందరు జీవితంలో ‘స్పెషల్ డే’కు పర్మిషన్ దొరకలేదా! అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక ఆ మ్యారేజ్‌కు హాజరైనవారు.. ‘పెళ్లి కొడుకు ఆఫీస్ వర్క్ చేయడం లేదని, బంధువులు వర్చువల్‌గా మ్యారేజ్ చూసేందుకు వీడియో కాల్ సెట్ చేస్తున్నాడు’ అని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed