ఇంట్లోనే కూర్చుంటే..ఈ జబ్బు ఖాయం

by sudharani |
ఇంట్లోనే కూర్చుంటే..ఈ జబ్బు ఖాయం
X

కరోనా వైరస్..లాక్ డౌన్.. ఈ రెండు నేటి మానవాళికి ముప్పుగా మారుతున్నాయి. కోవిడ్ 19 వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి. లాక్ డౌన్ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోంది. మరోవైపు ప్రజల జీవన శైలిలో తీవ్ర మార్పులు జరుగుతున్నాయి. 3 నెలలుగా దేశంలో లాక్ డౌన్ అమలవుతున్న విషయం విదితమే. ఈ సమయంలో ప్రజలు బయటకు రాకుండా ఇండ్లకు పరిమితం అయ్యారు. ఆ సమయంలో వారిపై ఒత్తిడి పెరగడంతోపాటు ఇంటి నుంచే పని చేస్తున్నారు. కదలకుండా కూర్చొని పనిచేస్తున్న వారి ఆరోగ్యంలో పలు మార్పులు చోటు చేసుకున్నట్లు పలు తాజా సర్వేల్లో వెల్లడవుతోంది.

లాక్ డౌన్ ప్రారంభం నుంచి ఇంటి నుంచే పనిచేస్తున్నచాలామంది ఉద్యోగుల జీవన శైలి మారిపోయింది. కదలకుండా కూర్చొని పనిచేస్తుండటంతో వారిలో షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయని పలు సర్వేల్లో తేటతెల్లం అయింది. దేశవ్యాప్తంగా 8200 మంది డయాబెటిస్ రోగులపై బీటో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో అనేక విషయాలు వెలుగుచూశాయి. మాములు డయాబెటిస్ రోగుల్లో ఉండాల్సిన దానికంటే 20శాతం అధికంగా షుగర్ లేవల్స్ ఉన్నట్టు తాజా సర్వేలు చెప్తున్నాయి. దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారిలో ఈ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. జీవన శైలిలో మార్పుల కారణంగా మార్చి నెల వరకు షుగర్ రీడింగ్ 135 ఎంజీ/ డిఎల్ ఉండగా, ఏప్రిల్ ఆఖరు నాటికి అది 165 ఎంజీ/ డిఎల్ కు చేరిందని ఆ సంస్థ సర్వేలో వెల్లడైంది.

Advertisement

Next Story

Most Viewed