- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామభక్తిని చాటిన హాస్యబ్రహ్మ
బ్రహ్మానందంలో కేవలం హాస్య నటుడే కాదు.. మంచి చిత్రకారుడు కూడా ఉన్నాడనే విషయం తెలిసిందే. ఆయనలోని ఆ కళా నైపుణ్యాన్ని అప్పుడప్పుడూ ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు కూడా. కుంచెపట్టి తన చేతికి పనిచెప్పే బ్రహ్మానందం.. లాక్‌డౌన్ వేళ తనకు ఇష్టమైన కవి శ్రీశ్రీ స్కెచ్‌తో పాటు కరోనా నియంత్రణ కోసం భారతీయుల పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా చక్కటి చిత్రాల్ని గీసేందుకు ప్రయత్నించారు. భారత్.. లాక్‌డౌన్ అనే అస్త్రంతో కరోనా వైరస్‌కు భయం పుట్టేలా చేసినట్టు చిత్రాలు గీశారు. కాగా, మరోసారి తన కళాహృదయాన్ని మేల్కొలిపాడు హాస్యబ్రహ్మ. అయోధ్య రామమందిర భూమి పూజ శుభ ఘట్టాన్ని పురస్కరించుకుని.. శ్రీ రాముని స్కెచ్ వేశాడు.
అయోధ్య రామ మందిర నిర్మాణం సందర్భంగా శ్రీరామచంద్రుడు.. తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన ఆంజనేయుడిని గుండెలకు హత్తుకుంటున్నట్టుగా ఎంతో అందంగా స్కెచ్ గీశారు హాస్యబ్రహ్మ. రామమందిర భూమిపూజ వేళ.. బ్రహ్మానందం తన రామభక్తిని ఈ విధంగా చాటుకున్నాడు. ఆయనకు శ్రీరాముడే కాదు, వెంకటేశ్వర స్వామి అన్న అమితమైన భక్తి. అందుకే ఇంతకుముందు తిరుమల వెంకన్న ప్రతిమను తయారుచేసి, దర్శకుడు కె రాఘవేంద్రరావుకు గుర్తుగా ఇచ్చారు.
కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమైన బ్రహ్మానందం.. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.
Another lovely pencil sketch by Hasya Brahma #Brahmanandam #TheArtandTheArtist pic.twitter.com/kpsB5ot1RF
— Shreyas Group (@shreyasgroup) August 5, 2020