బీజేపీని గెలిపిస్తే మనకు నష్టమే

by Shyam |
బీజేపీని గెలిపిస్తే మనకు నష్టమే
X

దిశ ప్రతినిధి మహబూబ్ నగర్ : భారతీయ జనతా పార్టీ తమ మేనిఫెస్టోలో ఏటా రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి, ఉన్న ఉద్యోగాలకు ఎసరు తెచ్చేలా వ్యవహరిస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పలు విద్యాసంస్థలలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణి దేవి కి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… అధికారం కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతూ దేశ ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్న భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్రంలోనూ విభేదాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో తీవ్రస్థాయిలో యువతను తప్పుదోవ పట్టించే విధంగా వ్యాఖ్యానాలు చేస్తూ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇప్పుడు మంచి లాభాల బాటలో పయనిస్తున్న ఎల్ఐసి, రైల్వే తదితర సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు చేస్తుందని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగులు ఇబ్బందులకు గురి కావలసిన పరిస్థితులు నెలకొంటున్నాయి అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఇరవైఒక్క రాష్ట్రాలలో స్వయం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు, నిరుద్యోగులు ఒకసారి గూగుల్లో ఏ ప్రభుత్వము ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో చూడాలన్నారు. ఇప్పుడున్న సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష పుట్టగతులు లేకుండా టిఆర్ఎస్ అభ్యర్థి మార్నింగ్ దేవుని భారీ మెజార్టీతో గెలుపొంది ఇస్తే మనం అభివృద్ధి చెందడానికి అవసరమైనచర్యలను మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటారని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

The BJP losing present existing jobs

Advertisement

Next Story

Most Viewed