మహిళలు కీలక పాత్ర పోషించాలి: రవ్వ

by Shyam |
మహిళలు కీలక పాత్ర పోషించాలి: రవ్వ
X

దిశ, వెబ్ డెస్క్: మానసిక సమస్యలు ఎక్కువైతే.. మనిషి మనుగడకే ప్రమాదకరమని, కుటుంబ సభ్యులు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆ కుటుంబంలోని మహిళలు కీలక పాత్ర పోషించాలని ప్రముఖ సైకియాట్రిస్ట్ హరికుమార్ రవ్వ అన్నారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం అశోక్‌నగర్ క్రాస్‌రోడ్స్‌లోని మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో “మహిళలు- ఆరోగ్యం” అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆమె మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న స్త్రీలలో 33 శాతం మంది భారతీయ మహిళలే ఉన్నారని, అందులో అత్యధికంగా 15-30 వయస్సు గలవారేనని ఆమె చెప్పారు. ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ హిప్నో కమలాకర్ మాట్లాడుతూ భారతదేశంతోపాటు అనేక దేశాల్లో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని, ఇది అత్యంత ఆందోళనకరమని అన్నారు. దేశంలోని మహిళలు అన్ని రంగాల్లోనూ అద్భుతాలు సాధిస్తున్నారని, భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా తయారవ్వాలంటే మహిళల భాగస్వామ్యం ఎంతో అవసరమని డాక్టర్ హిప్నో పద్మ పేర్కొన్నారు. యుక్త వయస్సులో ఎదురయ్యే సమస్యలను గుర్తించి, తగు పరిష్కారాలతో వాటికి చెక్ పెట్టాలని యువతకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ క్యారలిన్, తెలంగాణ శాఖ అధ్యక్షుడు వీరభద్రం, ఏపీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సైకాలజిస్టులు విజయశ్రీ, అరుణ, రాధ, వెంకట నరసమ్మ, లలితతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Tags: women’s day, Dr. hipno kamalaakar, padma kamalakar,

Advertisement

Next Story

Most Viewed