శ్మశానంలో మహిళల కట్టడి.. ఆత్మహత్యాయత్నం

by  |
శ్మశానంలో మహిళల కట్టడి.. ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆధునిక టెక్నాలజి రాజ్యం వెలుతున్న ఈ రోజుల్లోనూ ఉన్నత చదువులు అభ్యసించి కూడా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. మానవత్వాలను మరిచి అనాగరికుల్లా వ్యవహరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘటన మనుషుల్లోని మూర్ఖత్వాన్ని బయటపెట్టింది. నిడమర్రు మండలం కొవ్విడులో ఇద్దరు మహిళలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

అయితే వారిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించకుండా గ్రామ వలంటీర్, ఏఎన్ఎం గ్రామ కట్టబాట్ల పేరుతో శ్మశానంలో ఉంచారు. వారికి ఆహారం అందించకుండ కట్టడి చేశారు. దీంతో ఆకలికి తట్టుకోలేని ఓ మహిళ మనస్థాపంతో సమీపంలోని కాల్వలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయింది. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు వలంటీర్, ఏఎన్ఎంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆ మహిళాలిద్దరిని తాడేపల్లిగూడెం కోవిడ్ సెంటర్ కు తరలించారు.


Next Story

Most Viewed