ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా.. ప్రిసైడింగ్ అధికారిని నియమించని ఎల్జీ

by Dishanational5 |
ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా.. ప్రిసైడింగ్ అధికారిని నియమించని ఎల్జీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు శుక్రవారం(ఏప్రిల్ 26న) ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ఎన్నికల తేదీ వచ్చినప్పటికీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా ప్రిసైడింగ్ అధికారిని నియమించలేదు. దీంతో ఈ ఎన్నికలను వాయిదా వేసినట్లు పౌర సంఘం గురువారం ప్రకటించింది. ‘‘ఈ ఎన్నికలు ఈసీ అనుమతి, ప్రిసైడింగ్ అధికారి నామినేషన్‌కు లోబడి ఉంటాయి. అయితే, గడువు సమీపించినప్పటికీ ప్రిసైడింగ్ అధికారి నామినేషన్ జరగలేదు. దీంతో ఎన్నికలను పోస్టుపోన్ చేస్తున్నాం’’ అని మున్సిపల్ సెక్రటరీ కార్యాలయం నుండి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఎం నుంచి సలహాలు, సూచనలు లేకుండా తన అధికారాన్ని ఉపయోగించడం సబబు కాదని ఎల్జీ వీకే సక్సేనా వెల్లడించినట్టు సివిక్ బాడీ తమ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు, ఎల్జీ తీసుకున్న ఈ నిర్ణయంపై అధికార ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వాయిదాకు బీజేపీనే కారణమని, ఆ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా సక్సేనా పనిచేస్తున్నారని ఆరోపించారు. కాగా, మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఏప్రిల్ 1 నుంచి తిహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.




Next Story

Most Viewed