- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎంపిక చేస్తే ఒకే.. లేదంటే : శుభ్‌మన్ గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు గురించి తాను ఎక్కువగా ఆలోచించడం లేదని భారత స్టార్ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. తాజాగా జాతీయ మీడియాతో గిల్ మాట్లాడుతూ పొట్టి ప్రపంచకప్ జట్టు ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘భారత్‌కు ఆడటమే పెద్ద విషయం. ఇప్పుడు వరల్డ్ కప్ గురించి ఆలోచిస్తే నాతోపాటు గుజరాత్ టైటాన్స్ అన్యాయం చేసినట్టు అవుతుంది. టీ20 వరల్డ్ కప్‌కు నన్ను ఎంపిక చేయాలనిపిస్తే చేస్తారు. కానీ, ప్రస్తుతం నా దృష్టి మొత్తం ఐపీఎల్‌పైనే ఉంది. నా జట్టు నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఎలా పొందాలి, నా జట్టు కోసం నేను ఎలా ఆడాలి అనే దాని గురించే ఆలోచిస్తున్నా.’ అని చెప్పాడు.
ఓ ఆటగాడిగా వరల్డ్ కప్ ఆడాలని తనకూ ఉందని, టీ20 క్రికెట్‌లో అతి పెద్ద వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఉందన్నాడు. ‘గతేడాది వరల్డ్ కప్ ఆడాను. మరో ప్రపంచకప్ ఆడటం గొప్పగా ఉంటుంది. కానీ, దాని గురించి ఆలోచించడం లేదు. గత సీజన్‌లో దాదాపుగా 900 పరుగులు చేశాను. నన్ను ఎంపిక చేస్తే చేస్తారు. లేదంటే సెలెక్ట్ అయిన వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెబుతాను.’ అని గిల్ తెలిపాడు.