- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Election Affidavit: తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల ఆస్తుల చిట్టాలో వారిద్దరే టాప్.. ఆఫిడవిట్‌లో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు
దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు సమర్పించిన ఆస్తుల అఫిడవిట్‌లలో కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలోనే అత్యంత ధనవంతులైన ఇద్దరు ఎంపీ అభ్యర్థులు తెలుగు వారు కావడం విశేషం. కాగా నామినేషన్ దాఖలు చేసిన అఫిడవిట్‌ల ఆధారంగా ఆస్తుల వివరాలు పరిశీలిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కలిగిన ఎంపీ అభ్యర్థిగా గుంటూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ మొదటి స్థానంలో నిలిచారు.ఇక తెలంగాణ నుంచి చెవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు.
గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రూ.5,785 కోట్ల ఆస్తులు కలిగివున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అమెరికాలో వివిధ రూపాల్లో రూ.28.93 కోట్ల ఆస్తి, ఆయన పేరు మీద రూ.519 కోట్లు, ఆయన సతీమణి కోనేరు శ్రీరత్న పేరుతో మరో రూ.519 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా రూ.2,316 కోట్ల విలువైన చరాస్తులున్నాని అఫిడవిట్‌తో వెల్లడించారు. వారి వద్ద 181 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆయన సతీమణికి 2.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలిపారు.
ఇక చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి తన కుటుంబం పేరిట రూ.4,490 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా అఫిడవిట్‌తో తెలిపారు. విశ్వేశ్వరరెడ్డి పేరు మీద రూ.1,178 కోట్లు ఆస్తులుండగా, భార్య సంగీత రెడ్డి పేరుతో రూ.3,203 కోట్లు ఉన్నాయి. ఆయన పేరు మీద వివిధ బ్యాంకుల్లో రూ.17 కోట్ల అప్పులు ఉన్నట్లుగా వెల్లడించారు. విశ్వేశ్వరరెడ్డి వద్ద ప్రస్తుతం చేతిలో రూ.60 లక్షల క్యాష్, ఆయన భార్య వద్ద రూ.10.44 లక్షలు విలువైన ఆభరణాలు, వజ్రాలు ఉన్నాయని అఫిడవిట్‌లో తెలిపారు.
Read More..
AP elactions 2024 : ఏపీలో భారీగా నామినేషన్ల తిరస్కరణ..ఎందుకో తెలుసా..!