- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చచ్చి ఎవరెవరు వచ్చారో చూసింది.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?
దిశ, వెబ్‌డెస్క్: చావు.. ఎప్పుడు.. ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియదు. చావు వచ్చేటప్పుడు చెప్పి రాదు.. చనిపోయాక చావు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. మరణం తర్వాత ఎలా ఉంటుంది..? తమ మరణవార్త విన్నాక తమని చూడడానికి ఎవరెవరు వస్తారు..? అనేది అందరికి తెలుసుకోవాలని ఉంటుంది. కానీ, చావు తరువాత అలాంటివి ఎవరు చూడలేరు. అయితే ఓ మహిళ తన చావు ఎలా ఉంటుందో చూడాలనుకుంది. తన మరణ వార్త విన్నాక తనను చూడడానికి ఎంతమంది బంధువులు వస్తారో చూడాలనుకుంది. అనుకున్నదే తడవుగా తాను చనిపోయినట్లు ప్రకటించింది. శవ పీఠికలో మూడు గంటలు శవంలా పడుకొని డ్రామా ఆడింది. ఈ వింత ఘటన చిలీ లో వెలుగు చూసింది.
చిలీ రాజధాని శాంటియాగోకు చెందిన మైరా అలోంజో(59) కి ఒక వింత ఆలోచన వచ్చింది. తాను చనిపోతే ఎంతమంది వస్తారో తెలుసుకోవాలనిపించింది. వెంటనే ఆ విషయాన్ని ఇంట్లోవారికి చెప్పింది. తాను చనిపోయినట్లు బంధువులందరికి తెలియజేయమని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఖంగుతిన్నారు. ఇదేమి.. వింత కోరిక. బ్రతుకున్నవారు చనిపోయినట్లు చెప్పడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా మైరా తన కోరిక తీర్చాలని కుటుంబ సభ్యులను బతిమలాడి ఎట్టకేలకు ఒప్పించింది. ఇక మైరా తెల్లటి దుస్తులు ధరించి, తలపై పూల కిరీటం పెట్టుకొని, ముక్కులో దూది పెట్టుకొని తనకోసమే తయారుచేయించి శవపేటికలో శవంలా పడుకొంది. అంతేకాకుండా ఫొటోగ్రాఫర్లను పిలిపించుకొని ఫోటోలను కూడా తీయించుకుంది. అలా మూడు గంటలు మైరా సంతాప సభ డ్రామాలో శవంలా పడుకొంది. ఇక నిజంగానే తమ బిడ్డ చనిపోయిందనట్టు ఆమె తల్లిదండ్రులు నకిలీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ మూడు గంటల డ్రామాకు మైరా ఏకంగా రూ.1.03 లక్షలు ఖర్చు చేసిందంట. ఎవరి పిచ్చి వారికి ఆనందమనట్టు ఈమె డెత్ రిహార్సల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.