పిల్లలు లేరని వివాహిత ఆత్మహత్య

by Shyam |   ( Updated:2020-04-12 07:36:38.0  )

దిశ, మెదక్: వివాహం జరిగి తొమ్మిది ఏండ్లయినా పిల్లలు కలుగడం లేదనే కారణంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని భరత్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. జహీరాబాద్‌కు చెందిన వీరకుమార్‌తో నాగలక్ష్మికి తొమ్మిది ఏండ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి వారికి పిల్లలు కలుగలేదు. దీంతో మనస్తాపం చెందిన నాగలక్ష్మి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న జహీరాబాద్ఎ స్సై నోముల వెంకటేశ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నాగలక్ష్మి రాసిన సూసైడ్ నోట్ లభ్యమైందని, పిల్లలు లేరనే కారణంతో చనిపోతున్నానని అందులో పేర్కొన్నట్టు ఎస్సై తెలిపారు.

tags ; corona, lockdown, medak, women suicide,no child

Advertisement

Next Story