- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌కు భారీ షాక్.. ఎన్నికల వేళ ఆగ్రహంతో రోడ్డెక్కిన ప్రజలు..
దిశ, కరీంనగర్ సిటీ : దళిత బంధు కార్యక్రమంపై అధికార పార్టీకి ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. మరికొన్ని గంటల్లో అధికారికంగా ప్రారంభించబోతున్న ఈ పథకం ఓట్ల కామధేనువులా మారబోతుందనుకుంటే, అధికార పార్టీ పట్ల మరింత వ్యతిరేకత పెంచేలా కనిపిస్తోంది. ఈ పథకం అమలు కోసం చేపట్టిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, పారదర్శకంగా లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో శనివారం దళితుల ఆందోళనలు, నిరసనలు, రాస్తారోకోలు జిల్లాలో మిన్నంటాయి.
అధికారులు, అధికార పార్టీ నాయకులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే లబ్ధిదారుల జాబితాలో చోటు కల్పించారని ఆరోపిస్తున్నారు. పలు మండలాల్లో ర్యాలీలు నిర్వహించారు. సందట్లో సడేమియాలా కొంతమంది అధికారులు నిబంధనలు పాటించకుండా వ్యవహరించటం పట్ల దళిత సంఘాలు కూడా నిరసనలు చేపట్టాయి.
ఇల్లందకుంట మండల కేంద్రంలో ర్యాలీ..
దళిత బంధు కోసం 470 మంది దరఖాస్తు చేసుకుంటే 40మందిని ఎంపిక చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇల్లందకుంట మండల కేంద్రంలో దళితులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపిక అయిన వారిలో స్థానికేతరులే అధికంగా ఉన్నారని ఆరోపిస్తూ ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో, ఎంపీటీసీ భర్త కలుగ చేసుకోని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వస్తున్నారని, ఆయనతో మాట్లాడి అందరికీ మంజూరయ్యేలా కృషిచేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
.జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో దళిత బంధు అందరికీ ఒకేసారి వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ, వందలాదిమందితో దళిత కుటుంబాలు నిరసన చేపట్టాయి. అనర్హులను కూడా దళిత బంధు లబ్ధిదారులుగా ఎంపిక చేశారని ఆరోపిస్తూ, హుజురాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి గ్రామ దళితులు కరీంనగర్-వరంగల్ జాతీయ రహాదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అర్హులైన ప్రతీ దళిత కుటుంబానికి మొదటి విడతలోనే దళిత బంధు పథకం వర్తింపజేయాలంటూ, హుజురాబాద్ మండలం ఇప్పల నర్సింగాపూర్ గ్రామ దళితులు బస్ స్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించారు.
అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అలాగే, ఒక్క హుజురాబాద్ సెగ్మెంట్‌లోనే కాకుండా జిల్లా అంతటా దళిత బంధు ప్రారంభించాలని, పలు మండలాలు, గ్రామాల్లో కూడా దళితులు ఆందోళనలు నిర్వహించారు. ఆయా చోట్ల కొనసాగిన ఆందోళనల్లో పార్టీలకు అతీతంగా దళిత నాయకులు పాల్గొనటం గమనార్హం.