సీక్రెట్ రిలేషన్.. అతని కోసం వచ్చిన ఆమె మిస్సింగ్.. ఊహించని ట్విస్ట్?

by Sumithra |
సీక్రెట్ రిలేషన్.. అతని కోసం వచ్చిన ఆమె మిస్సింగ్.. ఊహించని ట్విస్ట్?
X

దిశ, పటాన్‌చెరు : ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తే పథకం ప్రకారం హత్య చేశాడు. అమీన్ పూర్ సీఐ శ్రీనివాసులు రెడ్డి కథనం ప్రకారం..అమీన్‌పూర్‌ మండలం జానకంపేటకు చెందిన నాగమణిని నరసింహులు అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆ మహిళ క్షణికమైన సుఖం కోసం తప్పటడుగు వేసింది. ఉన్నట్లుండి ఈనెల 2న నాగమణి అదృశ్యం అయ్యింది. దీంతో తన భర్త అమీన్‌పూర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. జిన్నారం మండలం దువ్వగుంటకు చెందిన జంగయ్య అనే వ్యక్తితో నాగమణికి వివాహేతర సంబంధం ఉందని తెలియడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మొదటగా తనకు సంబంధం లేదని చెప్పిన అతను, పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకున్నాడు. నాగమణిని తానే చంపినట్లు చెప్పాడు. పటాన్​చెరు మండలం రామేశ్వరంబండ గ్రామ శివారులో హత్య చేసినట్లు తెలిపాడు. అలాగే మృతదేహం ఉన్న ప్రాంతాన్ని చూపించాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీం బృందాన్ని రప్పించి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని రిమాండ్‌కు పంపినట్లు సీఐ పేర్కొన్నారు. నాగమణి మృతదేహం పెద్దకుంటలో పడి ఉండటాన్ని సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ నితిక పంతు పరిశీలించారు.

Advertisement

Next Story