వజ్రం దొరికింది.. మహిళా కూలీ దశ తిరిగింది

by Anukaran |
వజ్రం దొరికింది.. మహిళా కూలీ దశ తిరిగింది
X

దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లాలో మహిళా కూలీ దశ తిరిగింది. వర్షాకాలం వేరుశనగ విత్తేందుకు వెళ్లిన మహిళకు వజ్రం దొరికింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే…తుగ్గలి మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన ఓ మహిళా కూలీకి వేరుశనగ విత్తనం విత్తేందుకు పొలానికి వెళ్లింది. వేరుశనగ చెలకల్లో వేస్తుండగా వజ్రం కంటబడింది. దానిని తీసుకుని చెంగున ముడి వేసుకుని ఇంటికి తీసుకెళ్లింది. సాయంత్రం దానిని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓ వ్యాపారికి విక్రయించేందుకు చూపగా, ఐదు కేరట్ల వజ్రమని చెప్పి ఆమె మూడు తులాల బంగారంతో పాటు 5.50 లక్ష రూపాయల నగదు ఇచ్చి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story