- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళల భద్రతే ప్రధానం: సజ్జనార్
హైదరాబాద్‌లోని హెచ్‌ఐఐసీలో సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సాధికారత సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్, ఐజీ స్వాతిలక్రా, టెస్సీ థామస్, సినీనటి సాయిపల్లవితో పాటు పలువురు పాల్గొన్నారు. మహిళల భద్రత, ఇతర అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. సైబరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని మహిళా ఉద్యోగుల భద్రత కోసం షీ సేఫ్ అనే ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తేనున్నారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. మహిళల భద్రతే తమ ప్రథమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. షీ టీమ్స్ ద్వారా మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
చిన్నారుల కోసం ఏడాది పొడవునా ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తున్నామని సీపీ గుర్తు చేశారు. అనంతరం ఐజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. మహిళా సాధికారత సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆమె స్పష్టం చేశారు. పోలీసులకు ప్రజల నుంచి ఎంతో మద్దతు లభిస్తోందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు తమవంతు బాధ్యతగా నగదు ఇస్తున్నారని స్వాతి లక్రా తెలిపారు. చిన్నారుల కోసం ఏడాదిలో రెండుసార్లు ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ నిర్వహిస్తున్నామని ఆమె వెల్లడించారు. దర్పన్ సాంకేతిక సాయంతో చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగిస్తున్నామని స్వాతి లక్రా ఈ సందర్భంగా తెలియజేశారు.