నీరసంగా ఆస్పత్రికి వచ్చిన మహిళ.. కొవిడ్ రిపోర్టు అడిగేలోపే దారుణం

by srinivas |
నీరసంగా ఆస్పత్రికి వచ్చిన మహిళ.. కొవిడ్ రిపోర్టు అడిగేలోపే దారుణం
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. కొందరు ఆక్సిజన్లు లేక మరణిస్తుంటే.. మరికొందరు వైద్యం అందించే లోపే ప్రాణాలు కోల్పోతున్నారు. కొవిడ్ మహమ్మారి దెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో దారుణం చోటుచేసుకుంది.

నీరసంగా ఉన్న మహిళను బంధువులు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, కొవిడ్ రిపోర్టు కావాలని అక్కడి వైద్యులు అడిగారు. రిపోర్టు గురించి మాట్లాడుతున్న సందర్బంలోనే వైద్యం అందక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.దీంతో బాధిత కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

Advertisement

Next Story