- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా సాయం కోసం క్యూలైన్.. గుండెపోటుతో మహిళ మృతి
దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నగదు సహాయం తీసుకోవడానికి బ్యాంకుకు వచ్చిన మహిళ క్యూలైన్‌లోనే మృతిచెందన సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం వివరాలు రామారెడ్డిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు వద్ద ప్రభుత్వం ఖాతాల్లో వేసిన రూ. 1500 తీసుకోవడం కోసం జనం బారులు తీరారు. ఉదయం నుంచి క్యూల్యైన్‌లో నిలబడిన కన్నపూర్ తండా వాసి నేనావత్ కమల(45) గుండెనొప్పితో కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్నవారు వెంటనే 108కు సమాచారం అందించారు. సిబ్బంది చేరుకునే ప్రాథమిక చికిత్స అందిస్తుండగానే కమల మృతిచెందారు. క్యూలైన్‌లోనే మహిళ మృతిచెందడంతో అక్కడ ఉన్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. ఖతాదారుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, టోకెన్ ప్రకారం డబ్బులు చెల్లించే ఏర్పాటు చేసినా, విషాదం చోటుచేసుకుందని రామారెడ్డి సర్పంచ్ సంజీవులు వాపోయారు.
Tags: corona,lock down,heart stroke, women died, waiting in queline, corona help fund, tgb