ఏడోసారి పెళ్లి కావాలన్న తాత.. ఆరో భార్య ఏం చేసిందంటే!

by Anukaran |   ( Updated:2021-01-27 08:16:39.0  )
ఏడోసారి పెళ్లి కావాలన్న తాత.. ఆరో భార్య ఏం చేసిందంటే!
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ప్రస్తుత సమాజంలో పెళ్లంటేనే యువతీ, యువకులు ఆమడ దూరం ఉంటున్నారు. అందుకు కారణం జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి, పిల్లలు ఇంకేమైనా అని పేరెంట్స్‌కు స్పష్టం చేస్తున్నారు. మరికొందరైతే జీవితంలో స్థిరపడేందుకు పెళ్లి తప్పనిసరి అంటూ దాంపత్య జీవితానికి జై కొడుతున్నారు.

అయితే, ప్రస్తుత రోజుల్లో వివాహ బంధానికి ఎవరూ పెద్దగా వాల్యూ ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఎవరి ప్రయోజనాల కోసం వారు అడ్డదారులు తొక్కుతున్నారు. ఒకరినొకరు మోసం చేసుకుంటూ సంతోషంగా లీడ్ చేయాల్సిన దాంపత్య జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. దీనంతటికీ వివాహేతర సంబంధాలు, పెళ్లికి ముందే సహజీవనం వంటి కాన్సెప్ట్స్ కారణంగా తెలుస్తోంది.

సరిగ్గా ఇలాంటి ఘటనే గుజరాత్‌‌ రాష్ట్రంలోని సూరత్‌లో వెలుగుచూసింది. 63 ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి తనకు ఇదివరకే పెళ్లిళ్లు అయిన విషయం చెప్పకుండా 42 ఏళ్ల మహిళను ఆరోసారి పెళ్లి చేసుకున్నాడు.ఈ విషయం ఆలస్యంగా తెలిసిన ఆమె అతనికి దూరంగా ఉంటూ వస్తోంది. అయితే, తనతో శృంగారానికి ఆరో భార్య సహకరించడం లేదనే కారణం చూపి ఆ వ్యక్తి ఏడో పెళ్లికి సిద్ధమయ్యాడు. తనకు వధువు కావాలని వెతుకులాట ప్రారంభించాడు. అంతకుముందు ఆరో భార్యను ఆమె సోదరి ఇంట్లో వదిలేసి మరల తీసుకెళ్లడానికి రాలేదు.

దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తన భర్త నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని.. ఇదివరకే అతనికి ఐదు పెళ్లిళ్లు అయిన విషయం చెప్పలేదని ఫిర్యాదులో పేర్కొంది. అతన్ని కఠినంగా శిక్షించడమే కాకుండా తనకు న్యాయం చేయాలని కోరింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed