మనవడి చేతిలో అమ్మమ్మ హతం

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో భీమిలి మండలం దాకమర్రిలో మనవడే అమ్మమ్మను హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. దాకమర్రికి చెందిన కొంకిపాపీయమ్మను మనవడు కంటుభుక్త శ్రీనివాస్ మాయమాటలు చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్తానన్నాడు. ఆమెను బైక్ పైన పద్మనాభం సమీపంలో బర్లపేట ఊరవతల నిర్మాన్యుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి తాడుతో పీక నులిమి చంపేశాడు.

హత్య చేసిన అనంతరం మృతురాలి మెడలో ఉన్న ఆరుతులాల బంగారు ఆభరణాలతో నిందితుడు పరారయ్యాడు. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మనవడే ఆమెను హత్యచేసినట్టు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.  పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement