సెల్‌ఫోన్ పిచ్చిలో మానవత్వం మరిచిన మహిళలు (వీడియో)

by Shyam |   ( Updated:2021-10-25 04:09:15.0  )
Woman traveling metro
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజల్లో రోజురోజుకూ మానవత్వమనేది కనుమరుగవుతోంది. మనుషులంతా మర మనుషులుగా మారిపోతున్నారు. సంస్కృతి సంప్రదాయాలను మరిచి స్త్రీలను గౌరవించడాన్ని మరిచిపోతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ మెట్రోలో జరిగింది. మెట్రోలో వెళ్తున్న ఓ తల్లికి సీటు దొరకకపోవడంతో చంటిపాపని ఒడిలో లాలిస్తూ మెట్రోలో కింద కూర్చుంది. పక్కనే చాలామంది యువతులు, మహిళలు సీట్లలో కూర్చొని ఫోన్‌లో నిమగ్నమయ్యారే తప్ప, ఏ ఒక్కరూ సీటు ఇవ్వలేదు. దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేయగా.. వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతూ.. ‘చదువుకున్న ‘కు’ సంస్కారులు.. మనుషులు కాదు వీరు మర మనుషులు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను మీరు చూడండి.

Advertisement

Next Story