రోడ్డుపై కాలర్ పట్టుకొని క్యాబ్ డ్రైవర్‌‌ను చితకబాదిన మహిళ.. ఏం జరిగింది (వీడియో)

by Anukaran |   ( Updated:2021-11-17 22:54:56.0  )
రోడ్డుపై కాలర్ పట్టుకొని క్యాబ్ డ్రైవర్‌‌ను చితకబాదిన మహిళ.. ఏం జరిగింది (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : నడిరోడ్డులో క్యాబ్ డ్రైవర్ చెంప చెల్లుమనిపించింది ఓ యువతి. అతడి చొక్కా పట్టుకొని కోపంతో ఊగిపోతూ చెంపపై కొట్టింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఢిల్లీలో ఇద్దరు మహిళలు బైక్‌పై వెళ్తున్నారు. వీరి ముందు ఓ క్యాబ్ కారు వెళ్తున్నది. ఈ క్రమంలో బైకు.. కారును ఓవర్ టేక్ చేసేందుకు సైడ్ ఇవ్వాలంటూ వెనుకనుంచి మహిళలు హారన్ కొట్టారు. అయితే, రోడ్డు రద్దీగా ఉండటంతో క్యాబ్ డ్రైవర్ సైడ్ ఇవ్వలేకపోయాడు.

దీంతో ఆగ్రహించిన మహిళ కారు వద్దకు వచ్చి డ్రైవర్‌ను బయటకు లాగి.. అతడి చొక్కాపట్టుకొని తిడుతూ చెంపపై కొట్టింది. ఈ క్రమంలో రోడ్డుపై ఉన్నవారు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిని కూడా సదరు మహళ దూషించింది. ఆమె దాడి చేస్తున్నా క్యాబ్ డ్రైవర్ మాత్రం సైలెంట్‌గా చూస్తూ ఉండిపోయాడే తప్ప ఆమెను ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు సదరు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story