- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాహిత అనుమానాస్పద మృతి
X
దిశ, ఖమ్మం: భద్రాచలం పట్టణం జగదీశ్ కాలనీకి చెందిన సమ్మక్క అనే మహిళ గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఎస్సై నరేష్ దుర్భాషలాడటం వల్లే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. బంధువుల వివరాల ప్రకారం గుడుంబా అమ్ముతోందనే నెపంతో సమ్మక్క ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎక్సైజ్ పోలీసులు ఇటీవల తనిఖీలు నిర్వహించారు. కానీ, గుడుంబా లభ్యం కాలేదు. అనంతరం సమ్మక్క ఇంట్లో దాచుకున్న నగదు కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, ఎస్సై నరేష్ ఫిర్యాదు తీసుకోకపోగా సమ్మక్కను ఇష్టానుసారంగా దుర్భాషలాడారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ ఘటనను స్థానిక వామపక్ష నేతలు ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జడ్పీచై ర్మన్ కోరం కనకయ్య దృష్టికి తీసుకెళ్లారు. సమ్మక్క మృతికి కారణమైన నరేష్‌పై చర్యలు తీసుకుని, మృతురాలి కుటుంబానికి రూ. 10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించేలా చూడాలని కోరారు. దీనికి వారు స్పందిస్తూ పూర్తి వివరాలు తెలుసుకున్నాక స్పందిస్తామని, బాధితురాలికి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఘటనపై స్థానిక సీఐ వినోద్‌రెడ్డిని దిశ వివరణ కోరగా సమ్మక్కది ఆత్మహత్య కాదని తేల్చి చెప్పారు. కానీ, ఎలా చనిపోయిందనే విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. దీనిపై విచారణ చేపట్టామని, పోస్టుమార్టం రిపోర్టు అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని చెప్పారు.
Tags: bhadrachalam, jagadish colony, woman suspicious death, SI naresh, MLA podem veeraiha, zp chairman kanakaiah, crime
Advertisement
Next Story