స్టేషన్ వదిలి.. బెడ్‌రూంలో దూరిన మహిళా ఎస్ఐ, కానిస్టేబుల్

by Anukaran |   ( Updated:2020-12-19 06:26:18.0  )
స్టేషన్ వదిలి.. బెడ్‌రూంలో దూరిన మహిళా ఎస్ఐ, కానిస్టేబుల్
X

దిశ, వెబ్‌డెస్క్ : నెల్లూరు జిల్లాలో ఖాకీల కామలీలలు బయటపడ్డాయి. చెడు దారి పట్టిన వాళ్లను మంచి మార్గంలో పెట్టాల్సిన పోలీసులు.. వాళ్లే ఆ శాఖకు తలవంపులు తెస్తున్నారు. బాధ్యతగా విధులు నిర్వహించాల్సిన ఓ మహిళా ఎస్ఐ.. కానిస్టేబుల్‌తో కామ లీలలు సాగించింది. కానిస్టేబుల్‌కు భార్య ఉన్నా.. ఆమెను బెదిరిస్తూ రాసలీలల్లో మునిగి తేలింది. విషయం ఎస్పీకి తెలియడంతో మహిళా ఎస్ఐ స్టేషన్ వదిలి పరారీ అయింది.

నెల్లూరు జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో మహిళ ఎస్ఐగా పని చేస్తోంది. అదే పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న వివాహితుడైన కానిస్టేబుల్‌తో ఎస్ఐకి సాన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇద్దరు చెట్టాపట్టాల్ వేసుకోని తిరగడం, డ్యూటీ ముగిసినా కానిస్టేబుల్ ఇంటికి వెళ్లకపోవడంతో ఆయన భార్యకు అనుమానం వచ్చింది. ఆ కానిస్టేబుల్‌పై ఓ కన్నేసిన ఆమెకు వారి మధ్య ఉన్న ‘బంధం’తెలిసిపోయింది. వారి సంబంధంపై భర్తని నిలదీసింది. వెంటనే ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించింది.

అయినా.. ఎస్ఐ, కానిస్టేబుల్ మధ్య రోజురోజుకు దూరం తగ్గింది తప్పా.. పెరగలేదు. ఇద్దరూ మారుతారని రోజుల తరబడి ఎదురు చేసిన భార్య.. వారిలో ఎంతకూ మార్పు రాకపోవడంతో జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతోపాటు కానిస్టేబుల్‌పై కలువాయి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మహిళా ఎస్ఐ, కానిస్టేబుల్ రాసలీలల విషయం తెలుసుకున్న ఎస్పీ భాస్కర్ భూషణ్ ఈ కేసును విచారించాలని ఏఎస్పీని ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న మహిళా ఎస్ఐ తనపై ఫిర్యాదు చేస్తావా అంటూ కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి ఆయన భార్యపై రచ్చ చేసింది. ఈ విషయాన్ని కూడా కానిస్టేబుల్ భార్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సదరు ఎస్ఐ పరారీ అయింది. చట్టాన్ని రక్షించాల్పిన వాళ్లే ఇలా అడ్డదారులు తొక్కడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Next Story