మహిళా ఎస్‌ఐ దారుణ హత్య

by Sumithra |
మహిళా ఎస్‌ఐ దారుణ హత్య
X

విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ దారుణ హత్యకు గురయ్యారు. వివరాల్లోకెళితే.. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని పట్‌పడ్‌గంజ్ పారిశ్రామికవాడలోని తన ఇంటికి సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రీతి అహల్వాలియా వెళ్తోంది. ఆ సమయంలో ఆమె వెనుక వచ్చిన ఓ యువకుడు తుపాకితో మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. రెండు తూటాలు ఆమె శరీరంలోకి దూసుకెళ్లగా, మిగిలిన తూటాలు సమీపంలో ఉన్న కారు అద్దాలను తాకాయి. తీవ్రంగా గాయపడిన ప్రీతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, ఎన్నికలకు కొన్ని గంటల ముందు మహిళా ఇన్‌స్పెక్టర్ దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది.

Advertisement

Next Story