కుమారుడి కళ్లెదుటే ప్రాణాలు విడిచిన తల్లి

by Sridhar Babu |   ( Updated:2021-09-29 12:08:17.0  )
Accident
X

దిశ,ఖమ్మం రూరల్ : మండల పరిధిలోని కరుణగిరి బైపాస్ రోడ్డులోని సాయిగణేష్ నగర్ వద్ద బుధవారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. మండలంలోని సాయిగణేష్ నగర్ కాలనీకి చెందిన కొర్లపాటి మనోహరి తన కుమారుడు గిరీష్‌తో కలిసి సొంత పని నిమిత్తం ఖమ్మం వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రూరల్ మండలం కరుణగి బైపాస్ ప్రాంతంలో అత్యంత వేగంతో వచ్చిన గుర్తు తెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తల్లి కొర్లపాటి మనోహరి అక్కడికక్కడే (55)మృతి చెందగా, కుమారుడు గిరీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం నగరంలోని కిమ్స్ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Advertisement

Next Story