- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పక్కింటి వ్యక్తితో ఆ పని చేసుకుని మెల్లగా బయటకొచ్చిన భార్య.. సడెన్‌గా భర్త చూసి నిలదీసేసరికీ..
దిశ, వెబ్ డెస్క్: భార్యాభర్తలంటే ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్లాలి. కానీ, కొంతమంది వివాహేతర సంబంధాలు పెట్టుకుని భార్యను భర్త చంపడమో, లేక భర్తను భార్య చంపడమో చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఇలాంటి వార్తలే తరచుగా వింటున్నాం. 5 నిమిషాల సుఖం కోసం వారి పచ్చని సంసార జీవితాన్ని ఆగం చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్ లో కూడా ఇలాగే ఓ మహిళ పక్కింటి వ్యక్తి మోజులో పడి తన భర్తను చంపేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని ఉమ్రాయి గ్రామంలో శంకర్ లాల్ అనే వ్యక్తికి సీమ అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. తన కుటుంబాన్ని పోషించేందుకు ఆ వ్యక్తి డ్రైవర్ గా పని చేసేవాడు. అయితే, ఇలా ప్రతిరోజూ తన పనుల నిమిత్తం ఉదయాన్నే వెళ్లి మళ్లీ సాయంత్రం తర్వాత వచ్చేవాడు. ఈ క్రమంలో తన భార్య పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన భర్త పనులకు వెళ్లిపోగానే ఆ ఇంట్లోకి వెళ్లి తన భర్త వచ్చే ముందు మళ్లీ ఇంట్లోకి వచ్చేది. ఇలా చాలా రోజుల నుంచి వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అయితే, ఇటీవల భర్త పనులు ముగించుకుని అనుకోకుండా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో భార్య కనిపించలేదు. పిల్లలు మాత్రమే ఉన్నారు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో అతను ఆందోళన చెందాడు. చాలా సేపటి తర్వాత తన భార్య మెల్లగా పక్కింటి వ్యక్తి ఇంట్లో నుంచి వచ్చింది. ఇదేంటి పక్కింటి వ్యక్తి ఇంటిలో నుంచి వస్తున్నావ్..? వాళ్లింటికి ఎందుకు వెళ్లావ్ ? అని ప్రశ్నించాడు. దీంతో ఆమె భర్తతో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలో ఆమె ప్రియుడు కూడా అక్కడికి వచ్చాడు. వాళ్లిద్దరూ కలిసి భర్తపై దాడి చేశారు. తీవ్ర గాయాలైన భర్తను బంధువులు ఆస్పత్రిలో చేర్పించారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి భార్య, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.