పోర్న్ కాదు ఆర్ట్: నగ్నంగా కొండలెక్కిన మహిళ.. వీడియో వైరల్

by Anukaran |   ( Updated:2021-07-07 02:48:39.0  )
laura jasorka news
X

దిశ, ఫీచర్స్ : అమ్మాయిలు కొద్దిగా డిఫరెంట్‌గా డ్రెస్ వేసుకుంటేనే చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు. అదే నగ్నంగా తిరిగితే ఏమైనా ఉందా? కచ్చితంగా నోటికొచ్చిన బూతులన్నీ తిట్టేస్తారు. కానీ ఇవన్నీ పట్టించుకోనని చెప్తోంది 39 ఏళ్ల లారా జసోర్కా్. నగ్నంగా రాక్ క్లైంబింగ్ చేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన లారా.. నెట్టింట వైరల్ అయింది. అయితే తాను న్యూడ్‌గా కనిపించడం పోర్న్ కిందకు రాదని.. అదొక ఆర్ట్ అని అంటోంది. ప్రతీ మహిళ తమ బాడీని ప్రేమించుకోవాలని చెప్పేందుకు, మహిళా సాధికారత గురించి తన గొంతు వినిపించేందుకు ఇలా చేశానని తెలిపింది.

ఫ్రెండ్స్, ఫ్యామిలీ తను న్యూడ్‌గా ఉన్న పిక్స్‌ను చాలా ఇష్టపడతారని.. ఈ క్రమంలో ప్రతీ స్త్రీ కూడా తమ బాడీ పట్ల నెగెటివ్ ఫీలింగ్స్‌తో ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ సందేశం ఇచ్చేందుకు రెడీ అయ్యానని చెప్పింది. ఒంటి మీద నూలుపోగు లేకుండా కొండలెక్కిన లారా కేవలం షూస్ మాత్రం ధరించింది. ఈ క్రమంలో తనకు చాలా గాయాలయ్యాయని.. అవేమీ పట్టించుకోనని తెలిపింది. ఇక ఆమె నగ్నంగా రాక్ క్లైంబింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోపై కొంతమంది నెటిజన్లు ప్రశంసిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. స్త్రీ అనుకోవాలే కానీ ఆమెకు సాధ్యం కానిది ఏది లేదని కొందరు అంటుంటే.. సోషల్ మీడియాలో స్టార్ గా మారిపోవడానికి కొంతమంది ఏమైనా చేస్తారు, ఎంతకైనా దిగజారతారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story