- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్మల్ జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం
దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ లో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం భైంసా పట్టణంలోని రాహుల్ నగర్‌లో నివాసం ఉంటున్న కోతుల్గాం గ్రామానికి చెందిన గజన్ బాయి( 62 ) మహిళ బ్లాక్ ఫంగస్ తో మృతి చెందింది. ఆమెకు గత ఏప్రిల్ 14వ తేదిన కరోనా పరీక్షలు చేసుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
దీంతో ఆమె పట్టణంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకోగా ఈ మధ్యనే కోలుకుంది. ఈ క్రమంలో ఆమెకు గత కొన్ని రోజుల క్రితం జ్వరం రావడంతో ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో 5 రోజుల క్రితం నిజామాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో పరీక్షలు చేపిస్తే బ్లాక్ ఫంగస్ నిర్ధాణ అయింది. ఆసుపత్రిలో చికిత్స చెపిద్దాం అనుకుంటే ఇమ్యూనిటీ లేకపోవడంతో ఇంటికి తీసుకువచ్చి ఇంటి వద్దనే చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది. ఇలా బ్లాక్ ఫంగస్ కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం, వాటి నివారణకు అయ్యే ఖర్చు లక్షలలో ఉండడంతో ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు.