- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వ్యాక్సిన్ వేసుకోవడం మూలంగానే నా భార్య చనిపోయింది’
దిశ, ములుగు: ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలోని ఇంచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని క్రాస్‌రోడ్‌లో మహిళ మృతి కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ముక్కెర శోభ(55) ఈనెల 22న స్థానిక పీహెచ్‌సీలో కరోనా వ్యాక్సిన్ వేయించుకుంది. దీంతో ఆమెకు శుక్రవారం జ్వరం వచ్చి, ఒళ్లంతా నొప్పులుగా ఉందని తీవ్ర అస్వస్థతకు గురైంది. ముందుగా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి, అనంతరం వరంగల్ ఎంజీఎం తరలించారు. శుక్రవారం రాత్రి పరిస్థితి విషమించి ఆమె మృతిచెందింది. దీంతో వ్యాక్సిన్ వేసుకోవడం మూలంగానే నా భార్య చనిపోయిందని మృతురాలి భర్త చేరాలు ఆరోపించారు. వ్యాక్సినేషన్ తొందరగా పూర్తి చేయాలనే ఆలోచన మంచిదే అయినా, ఈ తొందరపాటులో ఎలాంటి ఆరోగ్య పరీక్షలు చేయకుండానే వ్యాక్సిన్ వేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వ్యాక్సిన్ సెంటర్‌కు వచ్చే వారికి తప్పనిసరిగా టెస్టులు చేయాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే వ్యాక్సిన్ వేయాలని అంటున్నారు.