- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాఠీ దెబ్బలకు మహిళ మృతి..
దిశ,మిర్యాలగూడ:
నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పోలీసుల దెబ్బలకు ఒక గిరిజన మహిళ మృతి చెందింది. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం అడవిదేవులపల్లిలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వుల్సాయిపాలెం గ్రామానికి చెందిన కేతవత్ సక్రి(55) అనే మహిళ నాటు సారా విక్రయిస్తోందని పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఆమెను ఎస్ .ఐ. నాగులు మీరా రెండురోజుల క్రితం పట్టుకెళ్లారని తెలిపారు. అనంతరం ఆమెను విపరీతంగా ఎస్ఐ కొట్టినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాగా శనివారం సక్రి మృతి చెందింది. తన తల్లి సక్రిని ఎస్. ఐ. నాగుల్ మీరా అకారణంగా విపరీతంగా కొట్టడంతో అనారోగ్యానికి గురై శనివారం చని పోయిందని ఆమె కుమారుడు కేతావత్ సైద ఆరోపించారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి పోలీస్ స్టేషన్ మీద దాడికి దిగారు. దీనితో పోలీసులు స్టేషన్ విడిచి పారిపోయారు. విషయం తెలుసు కున్న డీ.ఎస్.పీ. వెంకటేశ్వర్ రావు ఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు , గ్రామస్తులకు ఆయన సర్ధి చెప్పారు.