ఆస్పత్రి నుంచి బయటకు వెలగ్గొట్టారు.. బస్టాండ్‌లో ప్రసవం

by Shyam |
ఆస్పత్రి నుంచి బయటకు వెలగ్గొట్టారు.. బస్టాండ్‌లో ప్రసవం
X

దిశ, జనగామ: జనగామ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జనగామలోని మాతా శిశు ఆస్పత్రికి గర్భిణీ డెలివరీ కోసం రాగా వైద్యులు, సిబ్బంది నిర్లక్షంతో ఆరుబయటే ప్రసవించింది. బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఓ నిండు గర్భిణీ డెలివరీ కోసం చంపక్‌హిల్స్‌లోని ఆస్పత్రికి ఆదివారం వచ్చింది. ఈ క్రమంలో గర్భిణీని వైద్యులు పరీక్షించి రక్తం తక్కువగా ఉందని వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేశారు. కానీ ఆమె ఉన్న పరిస్థితి దృష్యా సిబ్బంది ఎవరూ పట్టించు కోలేదు. ఇక్కడ వైద్యం చేయడం కుదరదని బయటకు వెళ్లగొట్టారు. కనీసం మహిళలకు అంబులెన్స్ వసతి కూడా కల్పించలేదు. దీంతో నొప్పులు తట్టుకోలేని మహిళ ఆరుబయట బస్టాండ్ వద్దనే ప్రసవించింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నట్టు బంధువులు తెలిపారు.

Advertisement

Next Story