- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓ గ్రూప్ రక్తం బదులు మరో గ్రూప్ రక్తం ఎక్కించడంతో…
దిశ, నల్లగొండ: డాక్టర్ల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఒక గ్రూప్ రక్తానికి బదులు మరో గ్రూప్ రక్తాన్ని ఎక్కించడంతో ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలోనే కన్నుమూసింది ఓ మహిళ. ఈ ఘటన ఖమ్మం పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం సర్వారం గ్రామానికి చెందిన భీమపొంగు ముత్తమ్మ(38) అనే మహిళ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈ నెల 14న హుజూర్ నగర్ లోని శ్రీవల్లి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు గర్భసంచి ఆపరేషన్ చేశారు వైద్యులు. అయితే ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లు ఏబీ పాజిటివ్ రక్తానికి బదులు మరో గ్రూప్ రక్తాన్ని ఎక్కించారు. దీంతో ఆమె పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఖమ్మంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న ఆమె కోలుకోలేక ఈనెల 19న మృతి చెందింది. మృతురాలి కుమారుడు రవీందర్ ఫిర్యాదు మేరకు డాక్టర్ శ్రీవల్లిపై కేసు నమోదు చేశారు పోలీసులు.