- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బావిలో సగం కాలిన మహిళ డెడ్‌బాడీ.. ఆమె ఎవరు.. అసలేం జరిగింది.?
దిశ, వెబ్‌డెస్క్ : బావిలో సగం కాలిన మహిళ మృతదేహం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. తీరా డెడ్ బాడీని బావిలో నుంచి బయటకు తీసి చూశాక.. అక్కడున్న వారంతా ఒక్కసారిగా బోరున విలపించారు. ఇంతకీ ఆ బావిలో ఉన్న డెడ్ బాడీ ఎవరిది.. వారంతా ఎందుకు ఇలా విలపించారో తెలుసా.?
దేశంలో వరకట్న వేధింపులు ఎక్కడో ఓ చోట ప్రతీ రోజూ చూస్తూనే ఉన్నాం. వర్నకటం కోసం అత్తింటివారి వేధింపులు భరించలేక ఇప్పటికే చాలా మంది యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా అలాంటి ఘటనే జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోడెర్మా జిల్లాలోని జయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల యోగియాటిల్లా గ్రామంలో బావిలో తేలుతున్న మృతదేహం గురించి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. బావి నుంచి మృతదేహాన్ని వెలికితీసిన తర్వాత ఆ మృతదేహం రేణు దేవిదిగా గుర్తించారు. కాగా, ఈ ఘటన అనంతరం రేణుదేవి అత్తమామలు పరారు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఈ నేపథ్యంలో మృతురాలి కుటుంబ సభ్యులు తమ అమ్మాయిని అత్తింటివారే హత్య చేశారని ఆరోస్తున్నారు. అయితే.. యోగియాటిల్లా నివాసి సహదేవ్ యాదవ్ కుమారుడు భూపేంద్ర యాదవ్‌తో రేణు దేవి(30)కి 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత ఏడాది పాటు వీరి సంసారం బాగానే సాగింది. ఆ తర్వాత, వరకట్నంగా బైక్‌తో పాటు లక్ష రూపాయల నగదు తీసుకురావాలని రేణుపై అత్తింటివారు వేధించడం మొదలుపెట్టారు. వీటిని ఇవ్వకపోతే భూపేంద్ర యాదవ్‌కు రెండో పెళ్లి చేస్తామని కూడా బెదిరించారు. రేణు కుటుంబ సభ్యులు.. వారు అడిగిన డబ్బులు ఇవ్వలేకపోయారు.
దీంతో.. భూపేంద్ర యాదవ్ తన కుటుంబ సభ్యుల మద్దతుతో హజారీబాగ్ జిల్లాలోని బర్కట్టా పరిధిలోని మాన్పూర్ నివాసి బబితా దేవిని నాలుగేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లిని రేణుదేవి వ్యతిరేకించడంతో ఆమెపై వేధింపులు మరింత పెరిగాయి. ఈ క్రమంలో మృతురాలి సోదరుడు రాజేష్ యాదవ్ పోలీస్ స్టేషన్‌లో రేణుదేవి అత్త సావిత్రి దేవితో పాటు ఇతర కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశాడు. కట్నం ఇవ్వకపోతే ఇంటినుంచి రేణుదేవిని వెళ్ళగొడతామని కూడా వారు బెదిరించారని రాజేష్ యాదవ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా అక్టోబర్ 4న రేణు మృతదేహం ఆమె అత్తమామల ఇంటికి సమీపంలో ఉన్న బావిలో తేలుతున్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. ఈ సంగతి తెలుసుకున్న మృతురాలి సోదరుడు రాజేష్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. గ్రామస్తుల సహాయంతో బావి నుండి మృతదేహాన్ని వెలికితీశారు. సగం కాలిన ఆమె డెడ్ బాడీని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అత్తమామలే తన సోదరిని హత్య చేశారని రాజేష్ ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం అత్తమామలు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
- Tags
- jharkhand