యాచకురాలిపై సెక్యూరిటీ గార్డ్ దాడి

by Sumithra |
యాచకురాలిపై సెక్యూరిటీ గార్డ్ దాడి
X

దిశ, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యాచకురాలిపై సెక్యూరిటీ గార్డ్ దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. జహంగీర్ పీర్ దర్గా‌లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. కొత్తూరు మండలం జహంగీర్ పీర్ దర్గా ఆవరణలో బిచ్చమెత్తుకుంటున్న వృద్ధ యాచకురాలిపై వక్ఫ్ బోర్డుకు సంబంధించిన సెక్యూరిటీ గార్డ్ దౌర్జన్యం ప్రదర్శించాడు. చేతిలో ఉన్న కర్రతో వృద్ధురాలి కంటి పై దారుణంగా కొట్టడంతో ఆమె గాయపడింది. దర్గా ఆవరణలోనే వృద్ధురాలు కుప్పకూలిపోయింది.

Advertisement

Next Story