మెదడులో రెండు సూదులు.. ఎలా వచ్చాయో తెలియదు!

by  |
మెదడులో రెండు సూదులు.. ఎలా వచ్చాయో తెలియదు!
X

దిశ, వెబ్‌డెస్క్:

చైనా, హెనాన్ ప్రావిన్స్‌‌లోని జెంగ్జూ ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల ఝూ.. ఇటీవల ఓ కారు యాక్సిడెంట్‌కు గురైంది. ఆ యాక్సిడెంట్ కారణంగా తన తలకు అంతర్గతంగా ఏవైనా దెబ్బలు తగిలాయేమోనన్న అనుమానంతో హాస్పిటల్‌కు వెళ్లి సీటీ స్కాన్ చేయించుకుంది. ఆ రిపోర్ట్స్‌లో ఆమెకు అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాలేదని తెలుసుకుని సంతోషపడింది. కానీ డాక్టర్లు మాత్రం షాకయ్యారు. ఎందుకో తెలుసా? ఆమె మెదడును తాకుతూ ఉన్న రెండు సూదులను వారు సీటీ స్కాన్‌లో చూశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అవి ఉన్నట్లు ఝూకి కూడా ఏ మాత్రం తెలియదు.

ఈ ఒక్కో సూది పొడవు 4.9 మిల్లీ మీటర్లు ఉంటుందని డాక్టర్లు చెప్పారు. వీటి కారణంగా తనకు ఎలాంటి తలనొప్పులు గానీ, ఇబ్బందులు గానీ కలగలేదని ఝూ చెప్పడంతో అవి ఇబ్బంది కలిగించని చోట్లలోనే ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా ఆ సూదులు ఝూ పసివయసులోనే ఎవరో కావాలని పెట్టి ఉంటారని వారు అన్నారు. సూదుల వ్యాసం, పొడవును బట్టి ఈ విషయం అర్థమైంది. వాటి చుట్టూ కండరం కూడా అభివృద్ధి చెందిందని అందుకే ఆమెకు ఎలాంటి నొప్పి కలగడం లేదని వారు వివరించారు. అయితే ఝూను దత్తత తీసుకున్నపుడు ఆమె తల మీద రెండు నల్ల మచ్చలు చూసినట్లు ఆమెను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు చెప్పారు. అయితే ఇప్పుడు కాకపోయినా మరెప్పుడైనా ఇవి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని వీలైనంత త్వరగా ఆపరేషన్ చేసి తీసేయడమే మంచిదని వారు ఝూకి సలహా ఇచ్చారు. మరి ఝూ ఏం చేస్తుందో వేచి చూడాలి.


Next Story

Most Viewed