- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాసేపట్లో రాజీనామా పత్రంతో గన్‌పార్కు వద్దకు హరీష్ రావు.. CM రేవంత్ కూడా రావాలని సవాల్
దిశ, తెలంగాణ బ్యూరో: రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య రాజీనామా సవాల్ రసవత్తరంగా మారింది. ఇరువురి మధ్య లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కీలకంగా మారింది. రాజీనామా లేఖతో గన్‌పార్కుకు వస్తానని, రేవంత్ కూడా రావాలని సవాల్ చేశారు. అయితే రేవంత్ చర్చకు వస్తారా? రారా? సర్వత్రా ఆసక్తి నెలకొంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరకు తాను రాజీనామా లేఖతో వస్తానని, నువ్వు వస్తావా? రా దమ్ముంటే అని మరోసారి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడుదామని తెలిపారు.
అరెస్టా?... గృహనిర్బంధమా?...
గన్‌పార్కుకు వస్తానని హరీశ్ సవాల్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన వస్తే ప్రజల్లో మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. దానిని అడ్డుకునేందుకు హరీశ్ రావును అరెస్టు చేస్తారా? లేక గృహ నిర్బంధం చేస్తుందా? అనేది చర్చకు దారితీసింది. శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటనేది రాజకీయవర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటే, అడ్డుకోవాలని ప్రయత్నిస్తే దానిని రాజకీయంగా వాడుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
రేవంత్ రాకుంటే నష్టమే?
రుణమాఫీ అంశం కీలకంగా మారిన తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్కుకు రాకుంటే పార్టీకి నష్టం జరుగుతుందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని దేవుడిపై ప్రమాణం సైతం రేవంత్ చేశారు. అయితే ఈ తరుణంలో హరీశ్ రావు సవాల్‌ను స్వీకరించి గన్ పార్కుకు రాకపోతే ప్రభుత్వంపై నెగిటివ్ అంశం వెళ్లే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తుండదని, హామీలతో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే.. పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలనే నినాదంతో బీఆర్ఎస్ ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనుం ది. రుణమాఫీ అంశం కాంగ్రెస్ మేడకు ఉచ్చుగా మారుతుందా? ఎటుదారితీస్తుందోనని అనేది హాట్ టాఫిక్‌గా మారింది. శుక్రవారం గన్‌పార్కు వద్ద రాజీనామా లేఖ సర్వత్రా ఆసక్తి నెలకొంది.