ప్రభుత్వ సమ్మతి లేకుండా అమ్మితే అంతే సంగతులు

by Shyam |
ప్రభుత్వ సమ్మతి లేకుండా అమ్మితే అంతే సంగతులు
X

దిశ, వరంగల్: వర్షాకాలం సాగు చేసే పంటలపై ప్రభుత్వ గైడ్ లైన్స్ తీసుకోకుండా రైతులకు ఎవరూ విత్తనాలు విక్రయించరాదని, ఒక వేళ అలా చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వ్యాపారులను హెచ్చరించారు.మంగళవారం అర్బన్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో విత్తన కంపెనీ ప్రతినిధులు, డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నూతన పంటల నియంత్రణ పద్ధతుల విధానాన్ని అమలు చేస్తున్నందున జొన్న విత్తనాలు క్రయ విక్రయాలు చేయడానికి వీళ్లేదన్నారు.వరి పంట వేసేందుకు ఏయే జిల్లాకు, ఏ వెరైటీ ఎంత విస్తీర్ణంలో వేయాలో నిర్ణయించి లక్ష్యాన్ని కేటాయిస్తుందన్నారు. కేటాయింపు తర్వాత ఆయా ఏరియాల్లో ఏ రకం ఎంత విస్తీర్ణంలో వేయాలో నిర్ణయించి డీలర్లకు తెలియ పరుస్తామన్నారు. అప్పటి వరకు వరి విత్తనాల విక్రయం జరగొద్దని సూచించారు. ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా మొక్కజొన్న వేసిన రైతుకు ‘రైతు బంధు’వర్తించదని సీఎం కేసీఆర్ సోమవారం స్పష్టంగా చెప్పినందున, రైతులు తొందరపాటు నిర్ణయాలు తీసుకొవద్దన్నారు.అయితే ఇదివరకే మొక్కజొన్న, వరి విత్తనాలు తెచ్చుకొని సిద్దంగా తమకు నష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉందని, ఈ విషయంలో తమకు న్యాయం జరిగేలా చూడాలని డీలర్లు కలెక్టర్‌ను కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. కంది పంట వేసిన రైతులకు ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని కలెక్టర్ మరోసారి గుర్తుచేశారు. సమావేశంలో జేడీఏ ఉషా దయాళ్, డీడీ దామోదర్ రెడ్డి, డీఏం సీడ్ రఘు, విత్తన కంపెనీ ప్రతినిధులు, డీలర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed