మూడు గంటల్లో మూడు కోట్ల ఆదాయం

by Shyam |   ( Updated:2023-08-11 05:56:00.0  )
మూడు గంటల్లో మూడు కోట్ల ఆదాయం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ‘లాక్‌డౌన్’ నిర్ణయం ప్రకటించడంతో మద్యం షాపుల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ‘టానిక్ లిక్కర్’ దుకాణంలో కేవలం మూడు గంటల వ్యవధిలో మూడు కోట్ల రూపాయల మేర అమ్మకాలు జరిగినట్లు అంచనా. అధికారికంగా దుకాణం నిర్వాహకులు గానీ, ఎక్సయిజ్ అధికారులుగానీ దీనిపై స్పష్టత ఇవ్వలేదు.

నైట్ కర్ఫ్యూ లాంటివి ఉన్నప్పటికీ ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో మద్యం దుకాణాల్లో సుమారు రూ. 2,269 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. లాక్‌డౌన్ కారణంగా మద్యం ఆదాయం చేజారకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీరోజు దుకాణాలకు ఇచ్చే నాలుగు గంటల సడలింపును వైన్ షాపులకు కూడా ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని 2,216 వైన్ షాపులు, 1,200 బార్లకు సరిపోయేలా 15 మద్యం తయారీ బేవరేజెస్ సంస్థల్లో ఉత్పత్తిని ఉదయం నుంచి సాయంత్రం వరకు కొవిడ్ నిబంధనల ప్రకారం జరిగేలా ఎక్సయిజ్ శాఖ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed